వాలంటీర్లు సచివాలయం ఉద్యోగులదే మంత్రి శంకర్ నారాయణ
గోరంట్ల (అనంతపురం) నవంబర్ 20 (ప్రజాదర్బార్ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్క లబ్దిదారులకు అందేలా చూడవల్సిన బాధ్యత గ్రామ వాలంటీర్లు సచివాలయం ఉద్యోగులదే బాధ్యత అని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి మలాగుండ్ల శంకర్ నారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవశకం కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎస్ ఎల్ వి పంక్షన్ హల్ నందు బుదవారం నాడు మండల స్థాయి అధికారులు వాలంటీరు సచివాలయం ఉద్యోగులతో నవశకం కార్యక్రమంలో పై మంత్రి శంకర్ నారాయణ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్ర అభివృద్ధికి కోసం జగన్ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు వైఎస్ఆర్ రైతు భరోసా అమ్మ ఒడి రేషన్ కార్డులు మంజూరు పావలా వడ్డీ కంటి వెలుగు వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ వైఎస్ ఆర్ పింఛన్లు పంపిణీ ఇలా చెపుకుంటుపోతే లెక్కలేనన్ని సంక్షేమ పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తునట్లు మంత్రి వివరించారు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలని ఎక్కడ అవినీతి అక్రమాలకు తావులేకుండా వాలంటీర్ల నిజాయితీగా పనిచేయాలని వాలంటీర్లకు మంత్రి దిశనిదేశం చేశారు ఎవరైనా ఎక్కడైనా వాలంటీర్ల అవినీతి అక్రమాలకు పాల్పడితే అలాంటి వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని మంత్రి హెచ్చరించారు అలాగే గ్రామ సచివాలయం ఉద్యోగులు కానీ వాలంటీర్ల కానీ విధులకు కానీ ప్రభుత్వం నిర్వహించే సభలు సమావేశకు హాజరు కాకుంటే అలాంటి వారిని గుర్తించి విధులు నుండి తొలగించాలని అధికారులను మంత్రి ఆదేశించారు ప్రభుత్వనికి వాలంటీర్లు వెనుదనుగా నిలవాలని మంత్రి పిలుపునిచ్చారు ప్రతి వాలంటీర్లు సంక్షేమ పథకాలను ప్రతీ ఇంటి చేరవేలని పార్టీల కులాలకు మతాలకు అతీతంగా ప్రతి అర్హులకు సంక్షేమ ఫలాలు అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వాలంటీర్లు గ్రామ సచివాలయం ఉద్యోగుల పై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉద్యోగులు నిబంధతతో పని చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్ బాలకిషన్ ఎంపిడివో అంజినప్ప ఎం ఇఓ కలిముల్లా బిసి కార్పోరేషన్ ఇడి రామాంజనేయులు మంత్రి సోదరుడు మల్లికార్జున స్థానిక సిఐ జయనాయక్ తదితరులు పాల్గొన్నారు.