రాష్ట్ర సమాచార హక్కుచట్టం (ఆర్టీఐ) కమిషనర్లుగా ఇటీవల నియమితులైన ఐదుగురు సభ్యులు తమ బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం ఉదయం ఆర్టీఐ కమిషనర్ కార్యాలయంలో ‘నమస్తే తెలంగాణ’ మాజీ సంపాదకుడు కట్టా శేఖర్‌రెడ్డి, ‘టీ న్యూస్' చానెల్ మాజీ సీఈవో మైడ నారాయణరెడ్డి, విద్యార్థి నాయకుడు గుగులోత్ శంకర్‌నాయక్, సోషల్‌వర్కర్లు సయ్యద్ ఖలీలుల్లా, డాక్టర్ మహ్మద్ అమీర్ హుస్సేన్ ప్రమాణం చేశారు. ఆర్టీఐ చీఫ్ కమిషనర్ రాజాసదారాం వారితో ప్రమా ణం చేయించారు. వీరు మూడేండ్లపాటు పదవిలో కొనసాగుతారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ కమిషనర్ బుద్దా మురళి, జీఏడీ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, జీఏడీ డిప్యూటీ కార్యదర్శి లలిత, ఆర్టీఐ కమిషన్ కార్యదర్శి కవిత తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాలమల్లు తదితరులు హాజరయ్యారు.